Venkatesh | వెంకటేశ్ మళ్లీ స్పీడ్ పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే, మరో దర్శకుడికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. ఆ దర్శకుడెవరో కాదు, నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో అభిరుచిగల దర్శకుడిగా ప్రశంసలందుకున్న వేణు ఊడుగుల.
ప్రస్తుతం ఆయన ఈ స్క్రిప్ట్ పనిమీదే బిజీగా ఉన్నారట. మల్టీస్టారర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌తో పాటు మరో ఇద్దరు యువహీరోలు నటించనున్నట్టు సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తున్నది. సామాజిక సమస్యల చుట్టూ అల్లుకున్న కథలతో సినిమాలు తీసే వేణు ఉడుగుల.. వెంకటేశ్ కోసం ఏ తరహా కథను ఎంచుకున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.