Sankranthiki Vasthunam Trailer | అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ కిడ్నాప్ విషయం బయటకు తెలిస్తే.. అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలంటూ నరేశ్ చెప్పే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది..భర్తలతో భార్యలు హు హు అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థమంటూ వెంకీ చెబుతున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సంభాషణలు ఇంప్రెసివ్‌గా సాగుతున్నాయి. మొత్తానికి వెంకీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేంజింగ్గా సాగే ఇంటర్య్వూలు, చార్ట్ బస్టర్ పాటలు, ఇంప్రెసివ్ ప్రోమోలు.. ఇలా ప్రతీ విషయం సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్..
Toxic | హాలీవుడ్ స్టైల్లో యశ్ బాస్.. టాక్సిక్ ఫస్ట్ లుక్ లాంచ్ టైం ఫిక్స్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్
Pushpa 2 The Rule | బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఇవే