ఒకనాటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి వేద వ్యాస్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. కొన్నాళ్లుగా దర్శకత్వానికి ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ సరైన కంబ్యాక్ కోసం కాస్త టైమ్ తీసుకొని ‘వేద వ్యాస్’ పేరుతో ఓ కథ రాసుకున్నారట ఎస్వీ కృష్ణారెడ్డి. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తున్నది. కథ డిమాండ్ మేరకు చైనా, మలేషియా నుంచి కొత్త నటీనటుల్ని ఈ సినిమాకోసం ఎంచుకునే ప్రయత్నం కూడా కృష్ణారెడ్డి మొదలుపెట్టారట. గతంలో మాదిరిగానే ఈ సినిమాకు కూడా సంగీతం ఆయనే అందిస్తారు. కొత్తవాళ్లతో సినిమాలు తీసి హిట్ కొట్టడంలో కృష్ణారెడ్డి దిట్ట. ఆయన గత చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఈ సారి చేయబోయే ‘వేదవ్యాస్’తో.. తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారట కృష్ణారెడ్డి. ఈ సినిమా నిర్మాత, నటీనట, సాంకేతిక వర్గానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.