VD12 | లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ పడినా.. ఖుషితో బౌన్స్ బ్యాక్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కానీ.. విజయ్‌కు సాలిడ్ మార్కెట్ ఉన్న నైజాం, ఓవర్సీస్లో మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం విజయ్ రెండు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంత బాగానే నడుస్తుందనుకున్న టైమ్‌లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక శ్రీలీల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో రష్మిక రాబోతుందని ఇన్సైడ్ టాక్.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ గత రాత్రి నుంచి తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్‌కు స్కోప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సితార సంస్థ కూడా గ్రాండ్ స్కేల్లో సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తుందట. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ఆ మధ్యే విజయ్ తెలిపాడు.
మాఫియా, డ్రగ్స్‌తో కలకళం సృష్టిస్తున్న రౌడీ మూకలను అంతమొందించే పోలీస్‌గా విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.