చేతన్, కావ్య, రాజీవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వశం’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో కోన రమేష్ రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతంతో పాటు నగర నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని, ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత తెలిపారు.
తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శంకర, సంగీతం: కిరణ్ తోటంబ్లే, నిర్మాతలు: కోన రమేష్, యెన్నంశెట్టి ఆంజనేయులు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, కొరియోగ్రఫీ: కోన రమేష్.