వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘VT 15’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ నెల 19న ఈ సినిమా టైటిల్‌ని, గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. వరుణ్ కెరీర్లోనే ఇది వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అనీ, ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని ప్రకటనలో పేర్కొన్నారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.థమన్.