వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో-కొరియన్-హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.‘వీటీ15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం ఫారిన్ షెడ్యూల్‌తో బిజీగా ఉంది.
వరుణ్‌తేజ్‌తోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. మోస్ట్ ఎంటైర్టెనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్లో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దీంతో సినిమా 80శాతం పూర్తవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్ర పొషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.థమన్.