VT15 | రూటు మార్చేసిన వరుణ్ తేజ్.. VT15 ఫస్ట్ లుక్‌తో టార్గెట్ ఫిక్స్
VT15 | వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవలే కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన మట్కా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. వరుణ్ తేజ్ తాజాగా వీటీ15 (VT15) సినిమాను ప్రకటించేశాడు.
VT15 | టాలీవుడ్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యాక్టర్లలో ఒకడు వరుణ్ తేజ్ (Varun Tej). ఇటీవలే కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన మట్కా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ తాజాగా వీటీ15 (VT15) సినిమాను ప్రకటించేశాడు. వరుణ్ తేజ్‌కు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ వీటీ15 సినిమా ఫస్ట్ లుక్ షేర్ చేశారు.
డ్రాగన్ డిజైన్ ఉన్న జాడిపై కోడ్ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్లో చూడొచ్చు. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో టాలీవుడ్లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మేర్లపాక. ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలతోపాటు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటీనటులు, షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
హార్రర్ కామెడీ జోనర్ సినిమాలకు మూవీ లవర్స్‌లో మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. మరి వరుణ్ తేజ్ ఈసారైనా హిట్టు కొడతాడా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let’s spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025
Read Also :
Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

