వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘VT 15’ వర్కింగ్ టైటిల్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. వరుణ్‌తేజ్‌తోపాటు ముఖ్య తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ కెరీర్లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అనీ, ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీతో ఈ సినిమా సాగుతుందని, యూనిక్ కాన్సెప్ట్‌తో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా పానిండియా స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నామని మేకర్స్ తెలిపారు.
ఇండియాతోపాటు విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయని, త్వరలోనే ఎక్సైటింగ్ అప్టేడ్స్‌తో వస్తామని మేకర్స్ చెప్పారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.