వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ఇండియన్-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సోమవారం వరుణ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. కొరియన్ పోలీసులు కమెడియన్ సత్యను ఇంటరాగేట్ చేస్తున్న సీన్‌తో మొదలైన టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది.
యాక్షన్ ఎపిసోడ్‌తో ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్ ప్రత్యర్థులను ఊచకోత కోసిన అనంతరం టేబుల్‌పై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ‘నేను తిరిగి వచ్చాను’ అంటూ కొరియన్ భాషల్లో చెప్పడం కథపై ఆసక్తిని పెంచింది. ఇండియన్, కొరియన్ కల్చర్స్ని మేళవిస్తూ తయారుచేసిన సరికొత్త హారర్ కామెడీ చిత్రమిదని, వరుణ్‌తేజ్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.