Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామోజీఫిలిం సిటీలో మట్కా మూడో షెడ్యూల్ కొనసాగుతుందని కొన్ని రోజుల క్రితం అప్డేట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన వార్తను షేర్ చేశారు మేకర్స్.
ఆర్ఎఫ్సీ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని ఎక్జయిటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని తెలియజేస్తూ.. నోరాపతేహి లుక్ విడుదల చేశారు. తాజా లుక్ సాంగ్ షూట్‌కు సంబంధించినదని అర్థమవుతోంది. ఆర్ఎఫ్సీలో ప్రొడక్షన్ టీం 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్‌ను రీక్రియేట్ చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని టాక్.
.#MATKA RFC SCHEDULE WRAPPED💥
The new schedule is currently progressing at a rapid pace in Vizag 🔥
More exciting updates loading soon.
Mega Prince @ImVarunTej @matkathefilm pic.twitter.com/KCUnP4XPM8
— BA Raju’s Team (@baraju_SuperHit) July 18, 2024
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Malavika Mohanan | అందానికే అసూయ పుట్టేలా.. ట్రెండింగ్‌లో మాళవిక మోహనన్ స్టిల్స్