టాలీవుడ్ (Tollywood) హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గని (Ghani). కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తి మార్చేశాడు వరుణ్ తేజ్. తన ఫాలోవర్లకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు వరుణ్ తేజ్. గని టీజర్ ( Ghani teaser)ను మేకర్స్ విడుదల చేశారు. రాంచరణ్ (Ram Charan voiceover) వాయిస్ ఓవర్‌తో మొదలైంది గని టీజర్.
వరుణ్ తేజ్ బాడీ బిల్డింగ్, ఇంటెన్స్ లుక్, బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో స్టన్నింగ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ భామ, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) వరుణ్ తేజ్‌కు జోడీగా నటిస్తోంది. తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే థమన్ అదిరిపోయే బీజీఎంతో అదరగొట్టేశాడు. సునీల్ శెట్టి (Sunil Shetty) , ఉపేంద్ర, నరేశ్ ల పాత్రలు సినిమాకే హైలెట్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ప్రతీ ఒక్కడి కథలో కష్టాలుంటాయి.. కన్నీళ్లుంటాయి.. కోరికలుంటాయి..కోపాలుంటాయి..ప్రతీ ఒక్కరికీ చాంపియన్ అయిపోవాలన్న ఆశయం ఉంటుంది..కానీ విజేతగా నిలిచేది ఒక్కడే అంటూ హీరో పాత్ర గురించి రాంచరణ్ చెప్పే సంభాషణలతో సాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
జగపతిబాబు, నవీన్‌చంద్ర, నరేశ్ క్యారెక్టర్లు సినిమాను రంజింపజేసేలా చేస్తాయని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్దు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?