వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.
గూఢచారి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో వరుణ్‌తేజ్ ైస్టెలిష్‌గా కనిపిస్తారు. యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయి. కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.