వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తున్నది. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రెనైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని మూడో పాట రోమియో జూలియట్ ను మంగళవారం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాటను ఆలపించారు. అనంతరం నిర్మాత అల్లు బాబీ మాట్లాడుతూ..‘గని సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఇవాళ విద్యార్థినుల చేతుల మీదుగా రోమియో జూలియట్ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 25న చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’. అన్నారు.