Varun Tej-Lavanya Tripathi | వెడ్డింగ్ బెల్స్.. ఇటలీ పయనమైన వరుణ్-లావణ్య.. వీడియో
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya Tripathi ) వివాహ బంధంతో (wedding) ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. నవంబర్ 1వ తేదీన ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ఈ జంట ఇటలీ పయనమై వెళ్లింది (off to Italy).
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya Tripathi ) వివాహ బంధంతో (wedding) ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. నవంబర్ 1వ తేదీన ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబంతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలిసింది. ఈ మేరకు పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ఈ జంట ఇటలీ పయనమై వెళ్లింది (off to Italy). శుక్రవారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కాబోయే కొత్త జంట కెమెరా కంటికి చిక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పెళ్లి తంతులో భాగంగా అక్టోబర్ 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read..
Pindam Movie | శ్రీరామ్ ‘పిండం’ మూవీ టీజర్ వచ్చేది అప్పుడే.!
Thangalaan Movie | విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Skanda Movie | ‘స్కంద’ ఓటీటీ స్ట్రీమింగ్పై బిగ్ అప్డేట్.. రామ్ మాస్ ర్యాంపేజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

