Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో ఓ పాప బల్లపై పడుకొని ఉండటం, చుట్టూ నిల్చొని ఉన్న వ్యక్తులు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ టీజర్‌ను అక్టోబర్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.
Get ready to experience a glimpse of an epic in the horror genre.#Pindam teaser releasing on the 30th of October at 11AM.@saikirandaida@eswari_rao1225@Yeshwan71014110@kalaahi_media#kalaahimedia #thescariestfilmever #teaserlaunch pic.twitter.com/t8gPJKOIY1
— Vamsi Kaka (@vamsikaka) October 27, 2023
సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.