Nindha | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటించిన చిత్రం నింద (Nindha). క్రైం థ్రిల్లర్ జోనర్లో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. వరుణ్ సందేశ్ లీడ్ రోల్ పోషించగా.. తనికెళ్ల భరణి, భద్రమ్, చత్రపతి శేఖర్, సిద్ధార్థ్ గొల్లపూడి, శ్రేయా రాణిరెడ్డి, అన్నీ, క్యూ. మధు, సూర్య, అరుణ్ దలై, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.
జూన్ 21న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. వినాయక చవితి కానుకగా ఓటీటీలో విడుదలై.. సెప్టెంబర్ 6 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఓటీటీలో మంచి స్పందన వస్తోంది. ఒక్క రోజులోనే 1.4 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్తో ఓటీటీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ స్ట్రీమింగ్ అవుతోంది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ మూవీ వరుణ్ సందేశ్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని అభిప్రాయపడుతున్నారు ఓటీటీ లవర్స్.
Suriya 44 | సూర్య 44 లొకేషన్లో అభిమానులతో.. సూర్య ఇంతకీ ఎక్కడున్నాడంటే..?
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్