వరుణ్‌సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకురాలు. శివ కంఠంనేని, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్‌నివ్వగా, అశోక్‌కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు.
సోమవారం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకునే కథ ఇదని, వైఫ్ ఎందుకు మిస్ అయిందనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌కుమార్ ఎస్ఎస్, సంగీతం: సాయికార్తీక్, సంభాషణలు: ఆదిత్య భార్గవ్, కథ: ఉమర్జీ అనురాధ, దర్శకత్వం: స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ.