Trisha Krishnan Varsham Movie | తమిళ బ్యూటీ త్రిష కృష్ణన్ వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం 2004లో వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా త్రిషకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు అత్యంత కష్టపడిన సినిమా అంటే వర్షం సినిమానే అని చెప్పుకోచ్చింది ఈ భామ.
రీసెంట్గా ఒక తమిళ అవార్డుల వేడుకలో పాల్గోన్న త్రిష కృష్ణన్ తన అమ్మ ఉమ కృష్ణన్‌తో హాజరైంది. అయితే అవార్డు తీసుకోవడానికి వేదికపైకి త్రిష వెళ్లగా.. యాంకర్ త్రిష అమ్మను అడుగుతూ.. త్రిష కృష్ణన్ తన కెరీర్లో ఏ సినిమాకు అత్యంత కష్టపడిందని అడుగుతుంది. దీనికి ఉమ కృష్ణన్ మాట్లాడుతూ.. త్రిష కెరీర్లో చాలా కష్టపడిన చిత్రం వర్షం. ఈ సినిమా కోసం 45 రోజులు వర్షంలోనే గడిపాం. ఇదంత చూసి ఈ సినిమా మానేసి చెన్నైకి వెళదాం అనుకున్నాం. కానీ ధైర్యంతో ముందుకు నడిచాం. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టం అంతా మర్చిపోయం. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. అని చెప్పగానే.. త్రిష కూడా అవును వర్షం సినిమాకే నేను చాలా కష్టపడ్డాను అంటూ చెప్పుకోచ్చింది.
వర్షం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది త్రిష. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుంది.
#Prabhas – #Varsham Film is the MOST TOUGHEST FILM in my Entire CAREER- #TrishaKrishnan 😳😳😳🔥🔥🔥pic.twitter.com/DxXcfMVJUj
— GetsCinema (@GetsCinema) November 27, 2024