అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న మైథలాజికల్ రూరల్ డ్రామా ‘వనవీర’. ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు ‘వానర’. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా టైటిల్‌ను మార్చవలసి వచ్చిందని మేకర్స్ తెలిపారు. సిమ్రాన్ చౌదరి కథానాయిక. అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి నిర్మాతలు. జనవరి 1న విడుదల కానున్నది. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ ‘ఇప్పటికే ‘వానర’ అనే టైటిల్‌పై పబ్లిసిటీ చేశాం. అయిదురోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇలాంటి సమయంలో టైటిల్ మార్చాల్సివచ్చింది. ‘వానర’ అంటే హనుమంతుడే గుర్తొస్తారు. కానీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కులరాజకీయాలకు చెందిన అంశాలుంటాయి. అందుకే ఈ కథకు ‘వానర’ సరైన టైటిల్ కాదని సెన్సార్ వారు చెప్పడంతో మార్చక తప్పలేదు. ఈ సినిమాలో కీరోల్స్ చేసిన వారు కూడా కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా సపోర్ట్ చేయడం లేదు. ఏదేమైనా కంటెంట్‌పై నమ్మకంతో హిట్ సినిమా ఇవ్వబోతున్నాం’ అన్నారు.