‘ఉప్పెన’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) . ఈ యువ నటుడు హీరోగా నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ‘రంగరంగ వైభవంగా’ (Rangaranga Vaibhavamga). అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను లాంఛ్ చేయగా..అద్బుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) సినిమాల్లో ప్రత్యేకంగా ఒక మ్యానరిజం కనిపిస్తుందని తెలిసిందే.
పవన్ మ్యానరిజాన్ని (Pawan mannerisms )సిల్వర్ స్క్రీన్‌పై పలువురు హీరోలు ఇమిటేట్ చేయడం చూశాం. ఇపుడీ ఈ జాబితాలో మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా చేరిపోయాడని తాజా టీజర్ చూసి..తెగ డిస్కస్ చేసుకుంటున్నారు సినీ జనాలు. టీజర్ చివరలో ఫైట్ పూర్తయిన తర్వాత వైష్ణవ్ తేజ్ మావయ్య పవన్ కల్యాణ్‌లా తన చేతి వేళ్లు తడుముకుంటూ సిగ్గుపడుతూ కనిపిస్తున్నాడు. ఇంతకీ సిచ్యుయేషన్‌ను బట్టి వైష్ణవ్‌తేజ్ అలా నటించాడా..? లేదంటే నిజంగానే పవన్ మ్యానరిజంను ప్రయత్నించాడా..? అన్నది సినిమా చూస్తే తెలిసిపోనుంది.
ఏదేమైనా పవన్ కల్యాణ్‌ను వైష్ణవ్‌తేజ్ ఇమిటేట్ చేస్తున్నాడన్న అప్డేట్తో తెగ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా రొమాంటిక్ ఫేం కేతికశర్మ హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
టీజర్‌పై ఓ లుక్కేయండి మరీ..!