Hunter Chapter 1 | వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ హంటర్ చాప్టర్ 1. నందితా శ్వేత, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 13న) విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించగా.. ఎ.రాజశేఖర్&సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.
హంటర్ చాప్టర్ 1 చిత్రానికి అర్రోల్ కొరెల్లి సంగీతం అందించగా.. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సస్పెన్స్, థ్రిల్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తోంది.