చెన్నై : ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన చెన్నై పోరూర్‌లోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన లండన్ నుంచి తిరిగి రాగా.. ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డనట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వడివేలును అభిమానులు ‘వైగై పుయల్’ అని పిలుస్తారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల నాయి శేఖర్ రిటర్న్స్ అనే చిత్రంతో పునరాగమనం చేస్తున్నారు.
ఇటీవల వడివేలు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, దర్శకుడు సూరాజ్ నాయి శేఖర్ రిటర్న్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం లండన్‌కు వెళ్లారు. చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సైతం మేకర్స్ విడుదల చేశారు. మూడు రోజుల కిందట లండన్ నుంచి తిరిగి చెన్నైకి రాగా.. కొవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కోసం పంపారు.