అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘వారధి’. శ్రీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెయ్యాల భారతి, ఎండీ యూనస్ నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. భార్యభర్తల బంధం నేపథ్యంలో కథ నడుస్తుంది. నటీనటులందరూ కొత్తవాళ్లయినా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు.
కథలోని మలుపులు ఆద్యంతం ఆసక్తిని పంచుతాయి’ అన్నారు. ప్రేమ, భావోద్వేగాలు కలబోసిన థ్రిల్లర్ కథాంశమిదని, అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలున్నాయని హీరో అనిల్ అర్కా తెలిపారు. ప్రశాంత్ మడుగుల, రిధి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: షారుఖ్ షేక్, కథ, దర్శకత్వం: శ్రీకృష్ణ.