UV Creations | యూవీ క్రియేషన్స్ సంస్థ అంటే టాలీవుడ్ లో డార్లింగ్ ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరుంది. దీనికి కారణం యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మిర్చి, సాహో, రాధేశ్యామ్ సినిమాలని భారీ బడ్జెట్ తో నిర్మించడమే . మరోవైపు యూవీలో ప్రభాస్ అన్న ప్రమోద్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. మిగిలిన వారు ప్రభాస్ స్నేహితులే. ఈ నేపథ్యంలో ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరు యూవీ సంస్థకి ఉంది. దాదాపు పదేండ్ల కింద తన స్నేహితులు వంశీ, ప్రమోద్, విక్కీ ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టారు. ఈ పదేండ్లలో వాళ్ళు ఎన్నో సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి.
2013లో కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాతో ఈ బ్యానర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ఎక్స్ప్రెస్ రాజా, భాగమతి లాంటి అద్భుతమైన సినిమాలను ఈ బ్యానర్ అందించింది. అలాగే యూవీ కాన్సెప్ట్స్ పేరుతో మరో బ్యానర్ మొదలు పెట్టి చిన్న సినిమాలను కూడా నిర్మించారు. అందులో కూడా ఏక్ మినీ కథ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిథి అని చెప్పుకుంటూ నటీమణులని వారి ప్రతినిధులని కలిసి ఫ్రాడ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.
మేము ఒకటే చెప్పదలచుకున్నాం. సదురు వ్యక్తికి మా యూవీ క్రియేషన్స్ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. మేము ఎలాంటి అధికారిక సమాచారం అయిన లేదంటే కాస్టింగ్ సంబంధిత ప్రక్రియ అయిన కూడా కచ్చితంగా అధికారికరంగానే రివీల్ చేస్తాము. సీనీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయిన ఎంగేజ్ అయ్యే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మా సంస్థకి నటీమణులు అవసరం అయితే ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా మాత్రమే షేర్ చేస్తాం. అలానే మా పేరు బ్రాండ్ మిస్ యూజ్ చేస్తున్న ఈ తీరుపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు.