Ustaad Bhagat Singh | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022లోనే మొదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మార్పులు చేయమని హరీశ్‌ను పవన్ కోరగా.. హరీశ్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం హరీశ్ శంకర్ పవన్‌ను కలువగా.. ఈ మార్పులు గురించి చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో డైలాగ్స్‌కు సంబంధించి కూడా వాటి వెర్షన్‌ను మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం. కాగా ఈ మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తుంది.