థియేటర్లలో పవర్ తుఫాన్ కాస్త ముందుగానే రానుంది. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే.. అంటే, ఈ నెల 19వ తేదీనే విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.
వరుసగా లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాలపాటు ఉండే సెలవల్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే.. ఈ చిత్రం పాటలను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, నేపథ్యసంగీతాన్ని ఎస్.తమన్ అందించడం విశేషం. ఆలస్యాన్ని నివారించేందుకు, పనులన్నీ సజావుగా సాగేందుకు, పరస్పర చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం ఇదని, సినిమా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.
‘గబ్బర్‌సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్‌శంకర్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు విందుభోజనం లాంటి సినిమా ఇదని, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా పవన్‌కల్యాణ్‌లోని కొత్తకోణాన్ని చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి కథనం: కె.దశరథ్, రమేశ్‌రెడ్డి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్.