K Vijaya Bhaskar | ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘జై చిరంజీవ’ లాంటి ఆల్‌టైమ్ ఫ్యామిలీ బ్లాక్బస్టర్లను టాలీవుడ్‌కు అందించాడు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే. విజయ్ భాస్కర్. ఇక చాలా రోజుల తర్వాత ఆయన కొడుకు కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఉషాపరిణయం’ (Usha parinayam). లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో విజయ్ భాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే తాజాగా విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాను ఆగష్టు 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ భాస్కర్ చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీకమల్తో పాటు తాన్వీ ఆకాంక్ష, సూర్య, అలీ, వెన్నెలకిషోర్, శివాజీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా విజయ్ భాస్కర్ చేపడుతున్నారు.
#UshaParinayam worldwide grand release at theatres near you on 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝐧𝐝, 2024
A #VijayaBhaskarKraft‘s Film pic.twitter.com/ZD5NFeUGHa
— Vamsi Kaka (@vamsikaka) July 8, 2024