మహేష్, శృతిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊర్వి’. కిరణ వై దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంజనా ఫిలింస్ పతాకంపై గిరి పయ్యావుల నిర్మించారు. ఫిబ్రవరి 2న విడుదలకానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత ఆర్.కె.గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్ కథాంశమిది. అనుక్షణం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది. తెలంగాణ నేపథ్యంలో కథ సాగుతుంది. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా’ అన్నారు. తన కెరీర్‌కు ఈ సినిమా శుభారంభాన్నిస్తుందని హీరో మహేష్ తెలిపారు. మూడు పాటలుంటాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కీలకంగా ఉంటుందని సంగీత దర్శకుడు లక్ష్మణ సాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.