Urvashi Rautela | బాలీవుడ్ గ్లామర్‌క్వీన్ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాలో కూడా ఓ హుషారైన పాటలో నర్తించింది. ఇప్పటివరకు గ్లామర్ నాయికగానే తెలుగు ప్రేక్షకుల్లో ముద్రపడిపోయిన ఈ భామ పర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలపై దృష్టిపెడుతున్నదట. ఈ నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమాలో కీలక పాత్రను పోషించే అవకాశం దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కథానుగుణంగా పవర్ఫుల్ ఫీమేల్ రోల్ ఉం దట. ఈ పాత్ర లో ఊర్వశీ రౌతేలాను ఎంపిక చేశారని సమాచా రం. ఈ వార్త నిజమైతే ఊర్వశి రైతేలాకు కెరీర్ పరంగా మంచి బ్రేక్ దొరికినట్లేనని ఫిల్మ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా షూట్లో ఊర్వశి జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ చిత్రానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.