BRO Pre release event | పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రో జులై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇవాళ హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం నుంచి Pre Release Event కొనసాగుతోంది.
ఈవెంట్‌కు తెలుగు రాష్ట్రాల నలుమూలల అభిమానులు, మూవీ లవర్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) స్పెషల్ సాంగ్‌లో మెరవబోతున్న విషయం తెలిసిందే. ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో ధగధగ మెరిసిపోతూ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఊర్వశి రౌటేలా. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన బ్రో బీటీఎస్ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. బ్రో నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బ్రో నుంచి సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చే మై డియర్ మార్కండేయ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య వచ్చే రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో సాంగ్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు సముద్రఖని. ఈ చిత్రంలో. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.
బ్రో ఈవెంట్లో ఊర్వశి రౌటేలా..
Actress #UrvashiRautela looked stunning in a black outfit at the #BroPreReleaseEvent, leaving everyone in awe of her beauty and impeccable sense of style.🖤
Watch Live Now:https://t.co/tQSDtRB7cb#BROtheAvatar #BROFromJuly28th@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma… pic.twitter.com/pKSNPsxI7t
— Shreyas Sriniwaas (@shreyasmedia) July 25, 2023
బ్రో వర్కింగ్ స్టిల్స్..
Bro The Avatar1
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..