ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా.. ఖాళీగానే ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు

ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.. ఆ దర్శకుడి కెరీర్ సెట్ అయిపోతుంది.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారు.. అలాగే నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు అనుకుంటారు.. కానీ ఇదంతా ఒకప్పటి మాట. పరిస్థితులు ఇప్పుడు అంత అనుకూలంగా లేవు. సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా కొందరు దర్శకులు ఇప్పటికీ అవకాశం కోసం వేచి చూస్తూనే ఉన్నారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా రెండేళ్లకు పైగా ఎలాంటి సినిమా చేయకుండా పరశురామ్ ఖాళీగానే ఉన్నాడు. ఈ మధ్య మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీ అయ్యాడు. కేవలం పరశురాం మాత్రమే కాదు మరి కొందరు దర్శకులు కూడా సూపర్ హిట్స్ ఇచ్చి ఖాళీగా ఉన్నారు. తాజాగా ఇదే లిస్ట్ లో బుచ్చిబాబు చేరిపోయాడు.
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి వచ్చి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు బుచ్చిబాబు. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా ఏకంగా 51 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. అంతటి సంచలన విజయం తర్వాత బుచ్చిబాబు కోసం హీరోలు కచ్చితంగా ఎగబడతారు అని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఈయన తన రెండో సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాను అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కథ కూడా సిద్ధంగా ఉంది అని కన్ఫర్మ్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతుందని కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరో రెండేళ్ల వరకు బిజీగా ఉన్నాడు. కొరటాలతో పాటు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్.
దాంతో బుచ్చిబాబుకి ఇప్పట్లో అవకాశం రానట్లే. అందుకే తన తొలి సినిమా హీరో వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు బుచ్చిబాబు. అయితే ఇప్పుడు అది కూడా బెడిసికొట్టింది. దానికి కారణం మెగా మేనల్లుడు వరుస సినిమాలతో బిజీగా ఉండటమే. ఉప్పెన తర్వాత చాలా బిజీ అయిపోయాడు వైష్ణవ్ తేజ్. ఇప్పటికే ఈయన నటించిన రెండో సినిమా కొండ పొలం అక్టోబర్ 8న విడుదల కానుంది. దాంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఒక సినిమా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. వీటితో పాటు ఇంకో సినిమా కూడా లైన్లో ఉంది. ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్లు పడుతుంది. అందుకే తన కథకు సరిపోయే మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Bandla: ఎన్టీఆర్‌తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

