Kabzaa |ఇటీవలే కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కబ్జ’. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kitcha sudeep), శివరాజ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఆర్.చంద్రు దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కబ్జ మార్చి 17న కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదలై.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
కాగా థ్రియాట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 14న పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కబ్జ స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కబ్జ స్ట్రీమింగ్ కానుందని తెలియజేశారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, దేవ్‌గిల్, శ్రియా శరణ్, సుధ, మురళీ శర్మ, నవాబ్ షా, జాన్ కొక్కెన్, సుధర, అనూప్ రేవన్న, సునీల్ పురాణిక్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
పీరియాడిక్ యాక్షన్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరి కబ్జకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! 🔥#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI
— prime video IN (@PrimeVideoIN) April 11, 2023
Virupaksha Trailer | ఎవరికైనా చావుకెదురెల్లే దమ్ముందా..? సస్పెన్స్‌గా విరూపాక్ష ట్రైలర్
Shaakuntalam | సమంత శాకుంతలం సెన్సార్ అప్డేట్.. రన్‌టైం ఎంతో తెలుసా..?