Gaami | మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న చిత్రం గామి. అప్పుడెప్పుడో ఈ సినిమాను విశ్వక్సేన్ అనౌన్స్ చేశాడు. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా సమయానికి కంప్లీట్ కాలేదు. దీంతో గత ఏడాది సమ్మర్లో రిలీజ్ కావాల్సిన గామి వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను ప్రకటించి ఏడాదికి పైగా అయిపోతున్నా.. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ తప్ప ఒక్క అప్డేట్ కూడా రాలేదు. పైగా విశ్వక్సేన్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా అటకెక్కిసినట్టే అని అంతా అనుకున్నారు. దీంతో అసలు ఈ సినిమా వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి టైమ్‌లో గామి నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
గామి సినిమాను తొందరలోనే విడుదల చేయబోతున్నట్లుగా యూవీ క్రియేషన్స్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అఘోరాగా ఉన్న విశ్వక్సేన్ను టచ్ చేసేందుకు చాలామంది చేతులు వేస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్‌గా తగ్గట్టుగా ఉన్న క్యాప్షన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అతని అతి పెద్ద భయం మానవ స్పర్శ.. అతని గాఢమైన కోరిక కూడా మానవ స్పర్శే అంటూ ఉన్న కొటేషన్ సినిమాపై క్యూరియాసిటీని కలగజేస్తుంది.
#Gaami – 𝗛𝗶𝘀 𝗯𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗳𝗲𝗮𝗿 𝗶𝘀 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵. 𝗛𝗶𝘀 𝗱𝗲𝗲𝗽𝗲𝘀𝘁 𝗱𝗲𝘀𝗶𝗿𝗲 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼, 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵 ☯️
A unique tale of one man and his journey to conquer his biggest fear 🧿
In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv
— UV Creations (@UV_Creations) January 28, 2024
ప్రస్తుతం గామి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. అభినయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలు ఉంటుందని సమాచారం.