‘ఆహా’..రాబోయే భారీ సినిమాలన్నీ అక్కడే ఉన్నాయిగా..!
తెలుగులో ఓటిటి మొదలు పెడితే ఎక్కడ నడుస్తుంది.. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే నష్టాలు తప్పవు.. అందుకే నేను ఓటిటి సంస్థలకు దూరంగా ఉంటున్నాను అంటూ సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు కూడా కామెంట్ చేసారు.

తెలుగులో ఓటిటి మొదలు పెడితే ఎక్కడ నడుస్తుంది.. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే నష్టాలు తప్పవు.. అందుకే నేను ఓటిటి సంస్థలకు దూరంగా ఉంటున్నాను అంటూ సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు కూడా కామెంట్ చేసారు. కానీ ఓటిటి మొదలు పెట్టి.. అదే తెలుగు ఆడియన్స్‌తో ఆహా అనిపిస్తున్నాడు అల్లు అరవింద్. ఏడాదిన్నర కింద ఆహా మొదలైంది. అప్పుడు పెద్దగా సందడి లేదు కానీ మెల్లగా స్టార్ ఓటిటిగా మారిపోతుంది ఆహా. ఇక్కడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఇప్పుడు కొదవ లేదు.
అన్ని కలిపి తెలుగు ప్రేక్షకులకు బాగానే చేరువ చేస్తున్నారు ఆహాను. దాని కోసమే ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు కేవలం చిన్న సినిమాలు మాత్రమే కొన్న ఆహా.. ఇప్పుడు భారీ సినిమాల వైపు పరుగులు తీస్తుంది. క్రేజీ సినిమాలన్నీ ఇప్పుడు ఆహా చేతుల్లోకే వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే రవితేజ క్రాక్ సినిమాతో తన రేంజ్ పెంచుకుంది ఆహా. ఆ తర్వాత నాంది, కలర్ ఫోటో లాంటి సినిమాలను కూడా వీళ్లే తీసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా లవ్ స్టోరీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది.
దాంతో పాటు అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, నిఖిల్ 18 పేజెస్ లాంటి సినిమాలు కూడా ఆహా కొనేసింది. ఇవి మాత్రమే కాదు.. ప్రభాస్ రాధే శ్యామ్ హక్కుల కోసం కూడా ఆహా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాను మరో ఓటిటితో కలిసి విడుదల చేయబోతుంది ఆహా. విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని క్రేజీ సినిమాల హక్కులను సైతం ఆహా ఓటిటి సంస్థ కొనేసింది. ఇకపై ఆహా అంటే కేవలం చిన్న ఓటిటి కాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ మాదిరే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది.
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

