Unstoppable Season 4 | నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ స్టార్ నటుడు సూర్య, మలయాళం స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వచ్చి సందడి చేశారు. ఇక ఈ షోకు రీసెంట్గా హీరో అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ షోలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాటు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను బాలయ్యతో పంచుకున్నాడు. అయితే ఈ ఎపిసోడ్‌కి పార్ట్ 2 ఉందని చివర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్ట్ 2కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వహాకులు. ఈ ప్రోమో చూస్తే.. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు అతడి పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేశారు. ఇక ఇందులో అర్హ తెలుగు పద్యం చక్కగా పాడి వినిపించింది. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి.