Uma Devi: చిన్నారి వైద్యానికి పెద్ద సాయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

నాకు ఒకరు ఎదురొచ్చినా వాళ్లకే రిస్క్, నేను ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్కు.. అన్న చందాన బిగ్ బాస్ హౌజ్‌లో దూసుకెళ్లింది ఉమాదేవి. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తూ రెండువారాలు సందడి చేసిన ఉమాదేవి హౌజ్ నుండి రెండో వారం ఎలిమినేట్ అయింది. సిరి, యానీ మాస్టర్, షణ్ముఖ్, విశ్వ.. రెండోవారంలో ఉమాదేవిని నామినేట్ చేయగా, ప్రేక్షకులు కూడా ఉమాదేవికి తక్కువ ఓట్లు వేసి బయటకు పంపారు.
ప్రతి కంటెస్టెంట్‌తో కయ్యానికి కాలు దువ్వడమే కాక నోటికొచ్చిన బూతులు మాట్లాడటమే ఆమెను హౌజ్ నుండి బయటకు వచ్చేలా చేసిందని కొందరి వాదన. అయితే మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం తన రూటు మార్చుకుని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టింది. అయితే రెండు వారాలు హౌస్‌లో సందడి చేసిన ఉమాదేవి పారితోషికంగా లక్షా అరవై వేల రూపాయలు తీసుకుందని టాక్.
బిగ్‌బాస్ ద్వారా తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఇచ్చిందట. ఉమా దేవి దాతృత్వం గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, ‘కార్తీకదీపం’ భాగ్యగా ఎంతగానో ఫేమస్ అయిన ఉమాదేవి బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

