UI The Movie | కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘UI’. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. మనోహరన్ – శ్రీకాంత్ కేపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ విడుదల అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ‘UI’ అనే ఫిక్షనల్ ప్రపంచంలో ఉపేంద్ర డెమి గాడ్‌గా ఫిరోషియస్ లుక్‌లో అలరిస్తున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘యుఐ’ అనే ఫిక్షనల్ వరల్డ్‌లో ఉండనున్నట్లు తెలుస్తుంది. యూఐ అనే వరల్డ్‌ను పరిపాలించే రాజుగా ఉప్పి కనిపించనున్నాడు.
The wait is over. #UiTheMovie arrives in theaters this October – an experience you can’t afford to miss!https://t.co/HBgQYxBxi7#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth #NaveenManoharan @AJANEESHB @shivakumarart @Reeshmananaiah… pic.twitter.com/CkaDLxKDHe
— BA Raju’s Team (@baraju_SuperHit) August 16, 2024
Also Read..