నందు, అవికా గోర్ జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా థాంక్స్ మీట్‌ని హైదరాబాద్‌లో శనివారం మేకర్స్ నిర్వహించారు.
థియేటర్లలో స్పందన బాగుందని కథానాయకుడు నందు ఆనందం వ్యక్తం చేశారు. తన నటనను అంతా మెచ్చుకుంటున్నారని, భర్త క్రూరత్వాన్ని భరించాల్సిన అవసరం భార్యకు లేదని తెలిపే సినిమా ఇదని, ఈ సినిమాలో తన పాత్రకు ఇంత స్పందన రావడానికి కారణం దర్శకుడేనని, 95శాతం ఆ క్రెడిట్ అతనికే దక్కుతుందని నందు అభిప్రాయపడ్డారు.
‘నా భార్య గీతామాధురికి ఈ సినిమాలోని పాటలు నచ్చాయి. ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందంటూ, తనకు నచ్చిన సన్నివేశాల గురించి చెప్పింది’ అని తెలిపారు నందు. ఇంకా దర్శకుడు ప్రణవ స్వరూప్, బెక్కం వేణుగోపాల్ కూడా మాట్లాడారు.