Prema Desam | ఒకే వారంలో సేమ్ టైటిల్ సినిమాలు.. మూవీ లవర్స్ ఓటు ఎటు
అప్పట్లో ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చాలా సినిమాల టైటిల్స్‌ను ఇప్పటి దర్శకులు రిపీట్ చేస్తూ.. ఆ క్రేజ్‌ను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి జోనర్లో వస్తున్న చిత్రమే ప్రేమదేశం (Prema Desam).
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమా టైటిల్స్ రిపీట్ అవుతుంటాయని తెలిసిందే. అప్పట్లో ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చాలా సినిమాల టైటిల్స్‌ను ఇప్పటి దర్శకులు రిపీట్ చేస్తూ.. ఆ క్రేజ్‌ను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి జోనర్లో వస్తున్న చిత్రమే ప్రేమదేశం (Prema Desam). 1996లో వచ్చిన యూత్‌పుల్ రొమాంటిక్ ట్రాక్ ప్రేమదేశం (Prema Desam 1996).
వినీత్, అబ్బాస్, టబు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. నార్త్, సౌత్ ఇండియా ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిత్రం 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 9న రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆసక్తికర విషమేంటంటే ఇదే టైటిల్‌తో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమదేశం (Prema Desam 2022)కూడా ఒకే వారంలో విడుదలవుతుండటం.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రేమదేశం (2022) డిసెంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ మేకర్స్ వచ్చే వారంలో విడుదల చేయాలని ఫిక్సయినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. అయితే ఈ రెండు సినిమాలు ఒకే తేదీలో వస్తాయా..? అనేది చూడాలి మరి. మేఘా ఆకాశ్, త్రిగున్, అజయ్ కథుర్వార్, మాయ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మొత్తానికి ఇలా ఒకే టైటిల్‌తో ఒకే జోనర్లో తెరకెక్కిన రెండు తెలుగు సినిమాలు ఒకే వారంలో విడుదలవుతుండటం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. మూవీ లవర్స్ ఒకవేళ రెండూ ఒకే రోజు విడుదలైతే ఏ సినిమాకు మొదటి ప్రాధాన్యత ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ప్రేమదేశం -2022 ట్రైలర్..
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

