Rahul Ramakrishna | డిప్యూటీ సీఎంను ప్రశ్నిస్తే సైబర్ దాడులు.. ట్రోలింగ్ భరించలేక ట్వీట్లు డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ!
Pawan Kalyan | ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఒక ప్రముఖ నాయకుడిని ప్రశ్నించినా లేదా తమ రాజకీయ అభిప్రాయాన్ని బలంగా వినిపించినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావడం సర్వసాధారణంగా మారిపోయిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan | ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఒక ప్రముఖ నాయకుడిని ప్రశ్నించినా లేదా తమ రాజకీయ అభిప్రాయాన్ని బలంగా వినిపించినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావడం సర్వసాధారణంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సమాచార హక్కు చట్టం (RTI Act) లోని సెక్షన్ 4.1(బి) ప్రకారం పారదర్శకత, ముందస్తు సమాచార వెల్లడి గురించి ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఆ ట్వీట్ల చివరలో ఆయన “జై తెలంగాణ” అని రాయడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యం కూడా తోడవడంతో ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌తో విరుచుకుపడ్డారు. అయితే ఈ సైబర్ దాడి మితిమీరడంతో రాహుల్ రామకృష్ణ మొదట ‘ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను’, ‘నా వల్లనే ప్రాబ్లెమ్ అంటే వెళ్ళిపోతా మావా’ అంటూ బదులిచ్చినప్పటికీ.. చివరికి జనసైనికుల ఒత్తిడిని తట్టుకోలేక పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన ట్వీట్లను రాహుల్ డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ వివాదంపై విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడినైనా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని కానీ సోషల్ మీడియాలో ఒక ప్రశ్న రాగానే దానికి సమాధానం ఇవ్వకుండా సదరు వ్యక్తిపై వ్యక్తిగత దాడులకు దిగడం ఒక ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారిందని వారు అభిప్రాయపడ్డారు. అభిమానం అంధాభిమానంగా మారినప్పుడు, ఒక గుంపుగా ఏర్పడి అవతలి వ్యక్తిని మానసికంగా కుంగదీసేలా దాడి చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరూ నోరు విప్పకూడదనే భయాన్ని సృష్టిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ లాంటి సెలబ్రిటీలే ఈ స్థాయి ట్రోలింగ్‌ను తట్టుకోలేక వెనక్కి తగ్గుతున్నారంటే.. సామన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతుందని ఊహించుకోవచ్చు. సోషల్ మీడియా అనేది ఆరోగ్యకరమైన చర్చలకు వేదిక కావాల్సింది పోయి, కేవలం ఒకరినొకరు అణచివేసే ఒక గుంపుల యుద్ధంలా మారిపోవడం సమాజంలో భావప్రకటన స్వేచ్ఛకు దెబ్బతీయడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

