Tumbbad Director | ‘తుంబాడ్’ దర్శకుడి నెక్స్ట్ లెవెల్ ప్లాన్: ఒకేసారి రెండు భారీ చిత్రాల ప్రకటన.. రిలీజ్ ఇయర్స్‌తో సహా!
RahiAnilBarve | 'తుంబాడ్' చిత్రంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను తనవైపు తిప్పుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు రాహి అనిల్ బర్వే తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.
Tumbbad Director Rahi Anil Barve | ‘తుంబాడ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాహి అనిల్ బర్వే తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. విలక్షణమైన కథాంశాలు, విజువల్ వండర్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ దర్శకుడు.. తాజాగా రెండు కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటిస్తూ వాటి టైటిల్స్ మరియు విడుదల కానున్న సంవత్సరాలను వెల్లడించారు. గతంలో ‘తుంబాడ్’ (2018) సినిమా ద్వారా “తండ్రి, కొడుకుల దురాశ” అనే కాన్సెప్ట్‌తో పితృస్వామ్య వ్యవస్థ చక్రం ఎలా తిరుగుతుందో అద్భుతంగా చూపించిన రాహి అనిల్ బర్వే, ఇప్పుడు అంతకంటే విభిన్నమైన కథాంశాలతో ముందుకు వస్తున్నారు. ఆయన ప్రకటించిన రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ఒకసారి చూసుకుంటే.
1. పహాడ్పంగిరా (PAHADPANGIRA)
దేవుళ్లు, పురుషులతో పాటు మొట్టమొదటి ధైర్యవంతురాలైన మహిళ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. విముక్తి యొక్క ఆరంభం, స్త్రీవాదం (ఫెమినిజం) పుట్టుక నేపథ్యంతో సాగే ఈ విలక్షణ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
2. పక్షి తీర్థం (PAKSHITIRTHA)
పురుషుడు, స్త్రీ మరియు సృష్టి యొక్క చివరి సాక్షి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. పురాణాల్లోని ప్రసిద్ధ ‘కాకభుషుండి’ పక్షికి సంబంధించిన ఒక చీకటి గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ 2030లో విడుదల కానుంది. భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ప్రయోగాలకు వేదికగా నిలిచే రాహి అనిల్ బర్వే నుంచి వస్తున్న ఈ రెండు ప్రకటనలు చూస్తుంటే, ఆయన ప్రేక్షకులకు మరోసారి వెండితెరపై ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆధారిత ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇవే కాకుండా రాహి అనిల్ బర్వే ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులతో కలిసి రక్తబ్రహ్మండ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుండగా.. ఆదిత్య రాయ్ కపూర్, అలి ఫజల్, వామిఖా గబ్బీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
— rahi anil barve (@BarveRahi) June 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

