Salaar Ticket Price | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సలార్ మూవీపై భారీగా హైప్ నెలకొన్నది. ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, సలార్ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.65 వరకు, మల్టిఫ్లెక్స్‌లో రూ.100 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈ నెల 22 నుంచి 28 వరకు టికెట్ల పెంపునకు అనుమతించింది.
20 థియేటర్లలో సలార్ బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. మరో వైపు చిత్రబృందం ఏపీలోనూ ధరల పెంచుకునేందుకు అనుమతి కోరింది. టికెట్ల ధరలను పెంచేందుకు చిత్రబృందం అడ్వాన్స్డ్ టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించలేదు. తెలంగాణలో అనుమతులు వచ్చిన నేపథ్యంలో అడ్వాన్స్ బుధవారం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.200కోట్లకుపైగా బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిచింది.