‘ప్రతి అమ్మాయీ తనకు తాను పోల్చుకునేలా ఇందులో నా పాత్ర ఉంటుంది. అందరికీ కనెక్టయ్యే పాత్ర ఇది. ఈ సినిమా ఓ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.’ అని తృప్తి రవీంద్ర అన్నారు. విజయ్ ఆంటోని కథానాయకునిగా రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ‘భద్రకాళి’. తృప్తి రవీంద్ర, రియా జిత్తు ఇందులో కథానాయికలు. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. ఈ నెల 19న విడుదల కానుంది.
ఈ సందర్భంగా కథానాయికలు తృప్తి రవీంద్ర, రియా జిత్తు సోమవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. విజయ్ ఆంటోని 25వ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని, ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తానని, డైరెక్టర్ అరుణ్ప్రభు క్లారిటీ ఉన్న మేకర్ అని మరో కథానాయిక రియా జిత్తు చెప్పారు.