సాధారణంగా సినిమా తెరరూపం దాల్చాలంటే మొదట కథను సిద్దం చేసుకుంటారు. ఆ తర్వాత సినిమాలోని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాతే కథను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకెళ్తారు. కానీ టాలీవుడ్ (Tollywood) స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) విషయంలో మాత్రం ఇది రివర్స్ లో (రివర్స్ ఇంజినీరింగ్ ) రుగుతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తోంది.
మహేశ్ బాబు (Mahesh Babu) తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు మాటల మాంత్రికుడు రివర్స్ ఇంజినీరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాడట. ముందుగా మహేశ్ బాబును హీరోగా ఎంపిక చేశాడు. ఆ తర్వాత పలువురు నటీనటులను సినిమాలోకి తీసుకున్నాడు. అంతేకాదు తన అభిమాన సాంకేతిక నిపుణులను కూడా ఫైనల్ చేశాడు. షూటింగ్ డేట్స్ కూడా ఖరారు చేశాడు. త్రివిక్రమ్-మహేశ్ బాబు కలిసి ప్రేక్షకులకు సరికొత్త కథాంశాన్ని అందించాలని ఫిక్సయ్యారు.
మరి తాజాగా నడుస్తున్న చర్చ ప్రకారం త్రివిక్రమ్ కథను గురించి ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఈ అప్ డేట్ నిజమే అయితే త్రివిక్రమ్ మితిమీరిన ఆత్మవిశ్వాసం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. త్రివిక్రమ్ ప్లాన్ విజయవంతమైతే ఒకే, కానీ ఒకవేళ ఫెయిల్ అయితే త్రివిక్రమ్ ఇమేజ్ కు భారీగా గండిపడే అవకాశాలు లేకపోలేదంటున్నారు ట్రేడ్ పండితులు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?