Trivikram | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా, పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. ముందుగా రచయితగా తన కెరియర్ ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆయన తీసే సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా, దానికి కొద్ది రోజలు పాటు బ్రేక్ పడేలా కనిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ అట్లీతో చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ – అట్లీ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
ఈ గ్యాప్‌లో హారిక హాసిని బ్యానర్ లో వెంకీ మామతో త్రివిక్రమ్ ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా రామ్ చరణ్ ప్రాజెక్టు తెరమీదకొస్తోంది. వెంకటేష్ కన్నా ముందు మెగా పవర్ స్టార్ తోనే మాటల మాంత్రికుడు జత కట్టొచ్చనే ప్రచారం జోరుగా నడుస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆనందం హద్దులు దాటింది. త్రివిక్రమ్- రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే పెద్ది అయ్యాక సుకుమార్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులకు కనీసం ఏడాది సమయం పట్టేలా ఉంది. అందుకే చరణ్ ఖాళీగా ఉండటం ఇష్టం లేక త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది.
బన్నీ మూవీ లేట్ అవుతున్న కారణంగా ఎవరితో చేయాలనే మీమాంసను త్రివిక్రమ్ లో గమనించిన పవన్ కళ్యాణ్ స్వయంగా సలహా ఇచ్చి మరీ చరణ్ దగ్గరికి పంపినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ కాంబో కోసం సితార ఎప్పటి నుంచో ట్రై చేస్తుండగా, కొత్త నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తారని అంటున్నారు.ఏది ఏమైన త్రివిక్రమ్ ముందు చరణ్ తో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ పెద్ది ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైతే వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశం ఉంది.మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.