సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్‌కు తిరుగుండదు. అలాంటి వాటిలో త్రివ్రిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. వారిద్దరి కలయికలో నాలుగో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. పాన్ ఇండియా స్థాయి కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, భారీ హంగులతో తీర్చిదిద్దబోతున్నారని చెబుతున్నారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.