నటి త్రిష మరోమారు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తన సహచర నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఆమె రిలేషన్‌పై గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే త్రిష ప్రవర్తన కూడా ఉండేది. అయితే.. తాజాగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ని అన్‌ఫాలో చేసిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు విజయ్‌ని త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడంలేదని, అసలు ఫాలో అయితే కదా అన్‌ఫాలో చేసేది? అంటూ మరికొందరు నెటిజన్లు పైవార్తను ఖండిస్తూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు జరుపుకున్నారు.
తమిళనాట సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. కానీ త్రిష మాత్రం ఈసారి మౌనంగా ఉన్నది. ప్రతి ఏడాది విజయ్ పుట్టిన రోజున తప్పకుండా శుభాకాంక్షలు తెలిపే త్రిష ఈ ఏడాది మౌనంగా ఉండటం, ఇన్‌స్టాలో ప్రతి పుట్టిన రోజున ఆయనతో కలిసి దిగిన అరుదైన ఫొటోలను పంచుకునే త్రిష ఈసారి అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం.. ఈ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం తమిళనాట వినిపిస్తున్నది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే, త్రిషనే ఈ విషయంపై స్పందించాలి.