Trisha | దక్షిణాది అగ్ర నటి త్రిష కృష్ణన్ తన కెరీర్లో రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ మెయిన్ హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. మే 4న ఆమె తన 43వ పుట్టినరోజును జరుపుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు. త్రిష బర్త్‌డే సందర్భంగా నటి మంచు లక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి తన సందేశంలో “ఎల్లప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా ఉండే త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇది డబుల్ సెలబ్రేషన్ రోజు కావచ్చు” అంటూ ఆసక్తికరంగా పేర్కొన్నారు.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా “హ్యాపీ బర్త్‌డే బేబీ.. ఇది నీకు బెస్ట్ బర్త్‌డే అయి ఉండొచ్చు” అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. బండ్ల గణేష్ కూడా త్రిషని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అందుకు కారణం త్రిష బర్త్ డే రోజున తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఘన విజయం సాధించడం . ఆయన నేతృత్వంలోని పార్టీ విజయం సాధించడం, అదే రోజున త్రిష పుట్టినరోజు రావడం “డబుల్ సెలబ్రేషన్స్”గా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా త్రిష తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మీరంతా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు. మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని త్రిష తన ఇన్‌స్టాలో పేర్కొంది.
ఇక ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయ్ నివాసానికి వెళ్లి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. త్రిష పుట్టినరోజు, విజయ్ రాజకీయ విజయం ఈ రెండు కారణాలతో ఆమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే, కొత్త ప్రాజెక్ట్స్‌పై కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, త్రిష బర్త్‌డే ఈసారి మరింత ప్రత్యేకంగా మారిందని చెప్పాలి.