Trisha | “ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్యే లేనట్టు చివరకు నా వయసు గురించి పిచ్చి రాతలు రాయడం.. సిగ్గనిపించడంలేదా?’ అంటూ కొన్ని సాంఘిక మాధ్యమాలపై అంతెత్తు లేచింది త్రిష. తన వయసు గురించి ఇటీవల సోషల్మీడియాలో కొందరు చేసిన కామెంట్లపై త్రిష స్పందించింది.
‘బుద్ధిలేనివాళ్లు చేసే న్యూసెన్స్ ఇది. మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నా. కానీ ఆగేలా లేవు. అందుకే మాట్లాడుతున్నా. భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన కథానాయికలు చాలామంది ఉన్నారు. నేనే ప్రథమం కాదు. నాకు ఇప్పటికీ అవకాశాలు రావడం కొందరికి కంటగింపుగా ఉన్నట్టుంది. అందుకే పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని. చనిపోయేదాకా నటిస్తూనే ఉంటా. నటనకు వయసుతో నిమిత్తంలేదు. ఆ మాత్రం కామన్సెన్స్ లేకపోతే ఎలా? నా అందం, నా అభినయసామర్థ్యం నాకు గర్వకారణాలు’ అంటూ భావోద్వేగంగా స్పందించింది త్రిష.